దేశవ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కానీ ఒక్క మిజోరం రాష్ట్రం మాత్రమే కరోనాను కట్టడి చేయడంలో ముందుందనే చెప్పాలి. సోషల్ డిస్టెన్స్ పాటించడంతో పాటు మాస్క్‌లు ధరించి.. మిజోరం ప్రజలు ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో మిజోరంలో ఇప్పటివరకు 145 పాజిటివ్ కేసులు మాత్రమే నమోదయ్యాయి. గత 24 గంటల్లో మాత్రం అక్కడ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. ఇప్పటివరకు 30 మంది కోలుకున్నారు.
దీంతో మిజోరం ప్రభుత్వం కరోనా కేసులు పెరగకుండా మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. మరో నెల పాటు అంటే జులై 30 వరకు పొడిగించింది. అటు మయన్మార్, బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి ఎవరూ రాకుండా చర్యలు తీసుకుంటోంది.
జార్ఖండ్ ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ను జులై 31 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే రాష్ట్రంలో గత 24 గంటల్లో 28 కేసులు నమోదు కాగా ఇప్పటివరకు మొత్తం 2 వేల 290 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 12 మంది మరణించారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com