తెలంగాణలో భారీగా నామినేషన్లు.. కానీ అతి తక్కువగా అక్కడే..

0
తెలంగాణ (Telangana) అసెంబ్లీ (Assembly) ఎన్నికల్లో పోటీకి అన్ని నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 4,798 నామినేషన్లు దాఖలయ్యాయి. మొత్తం 119 నియోజవర్గాల్లో దాఖలైన నామినేషన్లను ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారులు (ఆర్వోలు) ఇవాళ పరిశీలించనున్నారు.
సీఎం కేసీఆర్ పోటీ చేస్తోన్న గజ్వేల్‌ (Gajwel)లో అత్యధికంగా నామినేషన్లు దాఖలయ్యాయి. గజ్వేల్‌లో అత్యధికంగా 145 మంది అభ్యర్థులు నామినేషన్‌ వేశారు. కేసీఆర్ (KCR) పోటీ చేస్తున్న మరో స్థానం కామారెడ్డి (Kamareddy)లోనూ 92 మంది నామినేషన్లు వేశారు. అతి తక్కువగా నారాయణపేట్‌ నియోజకవర్గంలో 13 మంది మాత్రమే నామినేషన్లు వేశారు.
నామినేషన్ల పరిశీలన అనంతరం నిబంధనలకు అనుగుణంగా లేని వాటిని రిటర్నింగ్‌ అధికారులు తిరస్కరించనున్నారు. అదే విధంగా ఎల్లుండి వరకు నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు ఉంది. కాబట్టి పోటీ నుంచి తప్పుకోవాలనుకునే అభ్యర్థులు ఎల్లుండి వరకు తమ నామినేషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఉంది. ఈ నామినేషన్‌ ఉపసంహరణ కూడా పూర్తయితే ఏ నియోజకవర్గం నుంచి ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉన్నారనేది తేలనుంది.

గజ్వేల్‌లో మరోసారి సెంటిమెంట్‌ రిపీట్ అవుతుందా.. గతంలో ఏం జరిగింది..?

తెలంగాణ అసెంబ్లీకి ఈనెల 30న ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలకు ఒకే రోజు పోలింగ్‌ నిర్వహిస్తారు. డిసెంబర్‌ 3న మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతోపాటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కూడా ప్రకటిస్తారు.

ఎల్లుండే తొలి సెమీస్‌ మ్యాచ్.. ఆ ఇద్దరినే వదిలేసిన రోహిత్‌ శర్మ

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleఎల్లుండే తొలి సెమీస్‌ మ్యాచ్.. ఆ ఇద్దరినే వదిలేసిన రోహిత్‌ శర్మ
Next articleసెమీస్‌ మ్యాచ్‌కు వాన గండం.. మ్యాచ్‌ రద్దు చేస్తే ఫైనల్ చేరేది ఆ జట్టే..