FINAL FIGHT: ఆస్ట్రేలియా- భారత్ ఫైనల్ మ్యాచ్‌ కోసం భారీ ఏర్పాట్లు..

0
వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్ మ్యాచ్‌ కోసం ICC, BCCI కూడా భారీ ఏర్పాట్లు చేశాయి. ఆస్ట్రేలియా- భారత్ జట్ల మధ్య మధ్యాహ్నం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ (మొతేరా) స్టేడియంలో జరగనున్న ఫైనల్ పోరుకు ప్రధాని మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ హాజరవుతున్నారు.
మరోవైపు ఈ మ్యాచ్‌కు వన్డే వరల్డ్‌కప్‌ గెలిచిన అన్ని జట్ల కెప్టెన్లను ఆహ్వానించారు. వీరి కోసం ప్రత్యేక బ్లేజర్‌ను బీసీసీఐ తయారు చేయించింది. అయితే ప్రస్తుతం జైలులో ఉన్నందున పాకిస్థాన్ మాజీ ప్రధాని, ఆ దేశ మాజీ కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ మ్యాచ్‌కు హాజరుకావట్లేదు.
మధ్యాహ్నం 1.35కు స్టేడియంపైన సూర్యకిరణ్‌ విమానాలు విన్యాసాలు చేయనున్నాయి. వింగ్‌ కమాండర్‌ సిదేశ్‌ కార్తీక్‌ నేతృత్వంలో తొమ్మిది విమానాలు రకరకాల విన్యాసాలతో కట్టిపడేయనున్నాయి. సాయంత్రం 5.30కు ఇప్పటి వరకు ప్రపంచకప్‌ గెలిచిన కెప్టెన్లందరినీ బీసీసీఐ ఘనంగా సన్మానించనుంది. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రీతమ్‌ నేతృత్వంలో 500 మందికిపైగా డ్యాన్సర్లు వివిధ సూపర్‌హిట్‌ పాటలకు సందడి చేయనున్నారు. యూకేకు చెందిన ఎల్‌ఎమ్‌ ప్రొడక్షన్స్‌.. స్టేడియంలో లేజర్‌ షో ఏర్పాట్లు చేసింది.

ఆస్ట్రేలియా- భారత్ మధ్య జరగనున్న ఫైనల్ మ్యాచ్‌కు ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్‌ ఇల్లింగ్‌వర్త్‌, రిచర్డ్‌ కెటిల్‌బొర్గ్‌ ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. వరల్డ్‌కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు అంపైర్లుగా చేయడం వీళ్లిద్దరికిది రెండోసారి. ఇక, థర్డ్‌ అంపైర్‌‌గా జోల్‌ విల్సన్‌ (వెస్టిండీస్), ఫోర్త్‌ అంపైర్‌గా క్రిస్‌ గఫానీ (న్యూజిలాండ్), మ్యాచ్ రెఫరీగా ఆండీ పైక్రాఫ్ట్ (జింబాబ్వే) వ్యవహరించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది.
Feedback & Advertisements: newsbuzonline@gmail.com
Previous articleBIG FIGHT: నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్.. రోహిత్ సేన బలమేంటి..?
Next articleమరోసారి సేమ్ సీన్ రిపీట్.. అప్పుడు సచిన్, ఇప్పుడు విరాట్ కోహ్లీ..