పెండింగ్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది బీఆర్‌ఎస్ అధిష్టానం. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఇప్పటికే 110 మందికి బీ ఫామ్‌లు కూడా అందజేశారు. అయితే మిగిలిన తొమ్మిది మందిని ఫైనల్ చేశారు బీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్. అలంపూర్ అభ్యర్థిగా ఎమ్మెల్యే అబ్రహంను మొదటి జాబితాలోనే ప్రకటించారు. కానీ అబ్రహంకు టిక్కెట్ ఇవ్వొద్దని.. అభ్యర్థిని మార్చాలని స్థానిక నేతలు డిమాండ్ చేశారు.
నామినేషన్ల స్వీకరణకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉన్నా అలంపూర్ నుంచి మరో అభ్యర్థిని రంగంలోకి దింపింది బీఆర్‌ఎస్. అబ్రహం స్థానంలో ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి వర్గానికి చెందిన విజేయుడికి టికెట్ ఖాయమైంది. అబ్రహంకు బదులుగా విజేయుడికి బీ ఫామ్ అందజేశారు.
గోషామహల్ అభ్యర్థిగా నందకిషోర్ వ్యాస్, నాంపల్లి నుంచి అనంద్‌కుమార్ గౌడ్‌ను ప్రకటించారు. చాంద్రాయణగుట్ట- ఎం సీతారాం రెడ్డి, యాకత్‌పురా- సామ సుందర్‌రెడ్డి, బహుదూర్‌పుర- ఇనాయత్ అలీ బక్రీ, మలక్‌పేట- తీగల అజిత్‌రెడ్డి, కార్వాన్- అయిందాల కృష్ణ, చార్మినార్- సలావుద్దీన్ లోడిలకు బీ ఫామ్‌లు అందజేశారు.