ఓ పనై పోయింది.. ఆ ఇద్దరు చేరుతున్నారు.. కాంగ్రెస్‌లో షర్మిల చేరుతారా..?

0
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ జోష్‌ తెలంగాణలోనూ కంటిన్యూ అవుతోంది. మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నారు. ఐదు- ఆరు నెలలుగా కొనసాగుతున్న సస్పెన్స్‌కు త్వరలో ఫుల్‌స్టాప్ పడనుంది. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో పాటు ప్రస్తుత అధ్యక్షుడు ఖర్గే‌తో ఇవాళ పొంగులేటి, జూపల్లి సమావేశం అవుతారు. పార్టీలో ఎప్పుడు చేరుతారనే విషయంపై ఇవాళ క్లారిటీ రానుంది.
త్వరలోనే కాంగ్రెస్ పార్టీలోకి BRS, BJP నేతలు కూడా వస్తారని హస్తం పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పటికే BJP అగ్రనేతల తీరుపై అసంతృప్తితో ఉన్న ఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి‌తో పాటు మరికొందరు నేతలు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అటు YSRTP అధ్యక్షురాలు షర్మిల కూడా కాంగ్రెస్‌లో తను ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీని విలీనం చేస్తారని.. కాంగ్రెస్‌ అగ్రనేతలతో చర్చలు జరుగుతున్నాయని అంటున్నారు. అందుకే కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను షర్మిల కలిశారని చెబుతున్నారు. కానీ షర్మిల ఈ విషయంపై స్పందించి.. ట్వీట్ కూడా చేశారు.
“వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి. అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనే, నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే.
జై తెలంగాణ” అని షర్మిల ట్వీట్ చేశారు.

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleఈటల రాజేందర్, రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతారా.. రేవంత్ రెడ్డి వ్యూహం ఫలిస్తోందా..?
Next articleతెలంగాణ BJPలో కీలక మార్పులు.. బండి సంజయ్‌కి ప్రమోషన్.. ప్రకటనే మిగిలింది!