సీన్‌లోకి పోసాని కృష్ణమురళి ఎంట్రీ.. రేవంత్ రెడ్డిపై సీరియస్

1
తెలంగాణలో ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కాయి. కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతల పరస్పర ఆరోపణలతో మాటల యుద్ధం సాగుతోంది. కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలను ఖండించారు టీఆర్ఎస్ నేతలు. రేవంత్ బాగోతాలు ఒక్కొక్కటిగా రేపటి నుంచి బయటపెడతామని గులాబీ లీడర్లు హెచ్చరించారు. అయితే “ముందుంది ముసళ్ల పండుగ.. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు” అని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.
మంత్రి కేటీఆర్‌‌కు సంబంధించిన ఫాంహౌస్ విషయంలో ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి స్పందించారు. ఓటుకు నోటు కేసులో బుక్కైన రేవంత్ రెడ్డి.. కేటీఆర్‌ను రాజీనామా చేయమనడం ఏంటని ఆయన ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ నిజాయితీ పరుడని.. అవినీతి చేశాడని నిరూపిస్తే, టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తానని సవాల్ చేశారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleడేట్, టైం ఫిక్స్.. టీఆర్ఎస్ నేతల విమర్శలపై ఎంపీ రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్
Next articleముఖ్యమంత్రికి అస్వస్థత.. రేపు సీఎంకు కొవిడ్ నిర్థారణ పరీక్షలు

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here