BJP MLA రఘునందన్‌పై చర్యలు తప్పవా.. పార్టీ మారితే పోటీ అక్కడే..?

0
MLA రఘునందన్ త్వరలో పార్టీ మారుతున్నారా.. అందుకే అధిష్టానంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారా.. ఢిల్లీలో రఘునందన్ చేసిన కామెంట్స్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
BJPలో తనకు ప్రాధాన్యత దక్కడం లేదని రఘునందన్ ఇప్పటికే అసంతృప్తితో ఉన్నారు. దీంతో త్వరలోనే రఘునందన్ పార్టీ మారుతారా అన్న చర్చ మొదలైంది. రఘునందన్‌కు పఠాన్‌చెరు, సంగారెడ్డి నుంచి ఎక్కడో ఓ చోట అవకాశం కల్పిస్తే BRSలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా రఘునందన్‌‌ను ఆహ్వానించినట్లు తెలుస్తోంది.
మరోవైపు రఘునందన్‌‌పై చర్యలు తీసుకోవాలని BJP నేతలు డిమాండ్‌ చేస్తున్నారు. రఘునందన్‌‌కు అంత దమ్ముంటే ఇండిపెండెంట్‌గా ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నిస్తున్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous article999కే జియో భారత్‌ 4జీ ఫోన్.. ఆకాశ్‌ అంబానీ లక్ష్యం నెరవేరేనా..?
Next articleటీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌.. ఏకగ్రీవంగా ఎంపికకు కారణం అదే!