రేపు ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫిక్రా జట్లు రెండో సెమీస్‌లో తలపడబోతున్నాయి. అయితే ఈ మ్యాచ్‌కు వాన గండం ఉంది. వాతావరణం సహకరించి మ్యాచ్ జరిగితే ఫ్యాన్స్‌కు పండుగే. కానీ వరుణుడు అడ్డుపడితే మాత్రం ఎల్లుండి (రిజర్వు డే) మ్యాచ్ నిర్వహిస్తారు. కానీ ఎల్లుండి కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. దీంతో ఎవరు ఫైనల్‌కు చేరుతారన్నది ఆసక్తిగా మారింది.
ఐసీసీ నిబంధనల ప్రకారం.. రేపు, ఎల్లుండి (రిజర్వు డే) ఇరు జట్లు కనీసం 20 ఓవర్ల చొప్పున కూడా ఆడలేని పరిస్థితి ఉంటే మ్యాచ్‌ను రద్దు చేస్తారు. లీగ్ దశలో ఆస్ట్రేలియా, దక్షిణాఫిక్రా జట్లలో టాప్‌లో నిలిచిన జట్టును ఫైనల్‌కు చేరినట్టు ప్రకటిస్తారు. ఆస్ట్రేలియా, దక్షిణాఫిక్రా 14 పాయింట్లతో సమంగా ఉన్నా మెరుగైన రన్‌రేట్ దక్షిణాఫిక్రాకే ఉంది. దీంతో రెండో స్థానంలో ఉన్న దక్షిణాఫిక్రా ఫైనల్‌కు చేరుతుంది.
And that's a wrap on the group stage at this World Cup!
Was this how you expected the table to look at the start of #CWC23? pic.twitter.com/JGSNElz9NQ
— ESPNcricinfo (@ESPNcricinfo) November 12, 2023