అక్కడ ఈటల.. ఇక్కడ రేవంత్ రెడ్డి.. ఈ ఇద్దరి టార్గెట్ ఒక్కటే..

0
గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్‌ పోటీ చేస్తున్నారు. అయితే ఈ రెండు చోట్ల కేసీఆర్‌ను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మరి ఈ ఇద్దరి లక్ష్యం నెరువేరుతుందా.. ప్రజలు గులాబీ బాస్‌కే జై కొడుతారా..?
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఈసారి రెండు చోట్ల పోటీచేస్తున్నారు. ప్రస్తుతం ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా ఉన్న హుజురాబాద్‌‌తో పాటు గజ్వేల్ నుంచి కూడా బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి హుజురాబాద్‌‌లో ఈటల, బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఢీకొనబోతున్నారు.
ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా రెండు చోట్ల పోటీచేస్తున్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి మల్కాజ్‌గిరి ఎంపీగా ఉన్నారు. కొడంగల్‌‌తో పాటు కామారెడ్డి‌లోనూ పోటీ చేస్తున్నారు.
గజ్వేల్: కేసీఆర్ (BRS) Vs ఈటల రాజేందర్ (BJP)
కామారెడ్డి: కేసీఆర్ (BRS) Vs రేవంత్ రెడ్డి (కాంగ్రెస్)
హుజురాబాద్‌: ఈటల రాజేందర్ (BJP) Vs కౌశిక్ రెడ్డి (BRS)
కొడంగల్‌: రేవంత్ రెడ్డి (కాంగ్రెస్) Vs పట్నం నరేందర్ రెడ్డి (BRS)
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleతెలంగాణ సీఎం కేసీఆర్ ఆ రికార్డును ఈసారి బ్రేక్ చేస్తారా..?
Next articleసిట్టింగ్ ఎమ్మెల్యేకు షాక్.. అక్కడ అభ్యర్థిని మార్చిన బీఆర్ఎస్