1987 బ్యాచ్ ఆర్ఆర్‌కు చెందిన వినయ్ కుమార్ సింగ్ తన రాజీనామా ఆమోదించాలని కోరుతూ కేంద్ర హోంశాఖకు బుధవారం లేఖ రాశారు. అయితే తాజాగా మరో ప్రకటనను విడుదల చేశారు. తాను రాజకీయాల్లో చేరడం లేదని తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ వీకే సింగ్ స్పష్టం చేశారు. ఏ రాజకీయ నాయకుడు రాష్ట్రాన్ని బంగారంగా మార్చలేరని, ఆ పని ప్రజలు మాత్రమే చేయగలరన్నారు. రాజీనామా అనంతరం విద్యారంగంలో కృషి చేస్తానని, రాజీనామాకు అనుమతి వచ్చిన తర్వాత తాను ప్రజలతో కలిసి ఎలా పనిచేస్తానో వివరిస్తానన్నారు.
క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పోలీస్ శాఖలో బీహార్‌కు చెందిన వీకే సింగ్ ముందు నుంచే సంచనాలకు కేంద్ర బిందువుగా మారారు. గతంలో జైళ్ల శాఖ డీజీగా ఉన్న ఆయనను ప్రింటింగ్ అండ్ స్టేషనరీ విభాగానికి మార్చిన్నప్పుడు ప్రెస్‌మీట్ పెట్టి ఆవేదనను పంచుకున్నారు. ఆ తర్వాత ఆయనను తెలంగాణ పోలీస్ అకాడమీకి మార్చారు. బాధ్యతలు స్వీకరించిన రోజే పోలీస్ అకాడమీ డంపింగ్ గ్రౌండ్‌లా మారిందని, IPSలకు శిక్షణ ఇచ్చే జాతీయ పోలీస్ అకాడమీ కూడా అందుకు అతీతం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు.
గత ఫిబ్రవరి 25న ఆయన డీజీపీ (సూపర్ టైమ్ స్కేల్)గా ఎంపానల్‌మెంట్ పొందారు. తెలంగాణ కేడర్‌కు చెందిన తేజ్‌దీప్‌కౌర్ మీనన్ గత ఏప్రిల్ 30న, టి. కృష్ణప్రసాద్, మార్చి 31న ఉద్యోగ విరమణ పొందగా రాష్ట్రంలో డీజీ కేడర్‌లో స్పష్టమైన ఖాళీలు ఏర్పాడ్డాయి. దీంతో తనకు డీజీపీగా పదోన్నతి కల్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాశారు. అలా కాకుంటే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. అన్నట్లే బుధవారం ఆయన రాజీనామా లేఖ పంపించారు. సర్వీసును బట్టి ఆయన ఈ ఏడాది నవంబరులో ఉద్యోగ విరమణ పొందాల్సి ఉంది.
వీకే సింగ్‌కు ఏసీబీలోగానీ, ఇంటెలిజెన్స్‌లోగానీ డీజీపీ హోదా ఇస్తే అక్రమాలు బయటపడుతాయన్న భయం ఉంది. అందుకే అన్ని అర్హతలున్నా ఆయనకు పోస్టింగ్ ఇవ్వడం లేదన్నారు ఎంపీ రేవంత్ రెడ్డి. అందరి జాతకాలు బయటపెట్టి బజారుకు ఈడుస్తానని రేవంత్ హెచ్చరించారు.
పోలీసు వ్యవస్థలో ప్రైవేటు సైన్యంగా పని చేసేవారికి, సొంత సామాజికవర్గం వారికి మాత్రమే పెద్దపీట వేస్తారా?ఫోన్ ట్యాపింగ్ లు, ప్రత్యర్థులను వేధించేవారికి మాత్రమే పోస్టింగులా!?ప్రభాకర్ రావు (ఐజీ-ఎస్ఐబి), వెంకటేశ్వరరావు (డిఐజీ), రాధాకిషన్ రావు (డీఎస్పీ-టాస్క్ ఫోర్స్) ఈ ముగ్గురూ నెలాఖరుకు రిటైరవుతున్నారు.ఈ ముగ్గురినీ తిరిగి కొనసాగించడానికి ఫైల్ సిద్ధం చేశారు.వీకే సింగ్ ప్రమోషన్ పై సీఎస్ కు లేఖ రాస్తే ఉలుకుపలుకు లేదు.హైదరాబాద్ పరిధిలోని కమిషనరేట్లలో పూర్తిగా కేసీఆర్ ప్రైవేటు సైన్యం పని చేస్తోంది
Posted by Anumula Revanth Reddy on Thursday, June 25, 2020