మద్యం ధరలను సవరిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశీయంగా తయారైన మద్యంతో పాటు విదేశీ మద్యం ధరలను ఏపీ సర్కార్ తగ్గించింది. ఈ మేరకు ధరలను సవరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
180ML బాటిల్ ధర రూ.120కి మించని బ్రాండ్లకు.. రూ.30 నుంచి రూ.120 వరకు ప్రభుత్వం తగ్గించింది. క్వార్టర్ ధర రూ.120 నుంచి రూ.150 వరకూ ఉన్న బ్రాండ్లకు.. రూ.30 నుంచి 280 వరకు తగ్గించారు. క్వార్టర్ రూ.190 నుంచి రూ.210 కంటే ఎక్కువ ఉన్న బ్రాండ్లకు.. రూ.40 నుంచి రూ.300 వరకు పెంచుతున్నట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచే ఈ ధరలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
ఇతర రాష్ట్రాల నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు తక్కువ బ్రాండ్ విలువ ఉన్న మద్యం ధరలను తగ్గించాలంటూ స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఏపీలోని పలుచోట్ల శానిటైజర్లు, మిథైల్ ఆల్కహాల్ తాగి పలువురు మృతిచెందడం, మద్యం అక్రమ రవాణా నేపథ్యంలో ఎస్‌ఈబీ పలు సూచనలతో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది.