YSRTP అధ్యక్షురాలు షర్మిల ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా.. ? పోటీ చేస్తే ఎక్కడి నుంచి బరిలోకి దిగబోతున్నారు..? గతంలో చెప్పినట్టు పాలేరు నుంచేనా.. లేక మరో స్థానం నుంచి పోటీ చేస్తారా..? ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
YSRTP ఏర్పాటు చేసినప్పటి నుంచి పాలేరు నియోజకవర్గంపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు షర్మిల. పాలేరు నుంచే పోటీకి సై అన్నారు. కానీ ఇప్పుడు షర్మిల ఆ నిర్ణయాన్ని మార్చుకున్నారని ప్రచారం జరగుతోంది. తన తల్లి విజయలక్ష్మిని పాలేరు నుంచి పోటీ చేయించాలని ప్లాన్ చేస్తున్నారు. పాలేరు టికెట్‌ను కాంగ్రెస్ పార్టీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి కేటాయించడమే కారణమని తెలిసింది. దీంతో షర్మిల మిర్యాలగూడ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
మరోవైపు పాలేరులో ఇవాళ YSRTP కార్యకర్తల సమావేశం జరగనుంది. ఈ సమావేశం తర్వాత విజయలక్ష్మి పోటీపై స్పష్టత రానుంది. ఇప్పటికే YSRTPకి ఎన్నికల సంఘం బైనాక్యులర్ గుర్తును కేటాయించింది. కానీ YSRTP అభ్యంతరం తెలిపింది. బైనాక్యులర్‌కు బదులుగా ఫుట్‌బాల్ లేదా అగ్గిపెట్టె గుర్తును కేటాయించాలని కోరింది.