స్మితా సబర్వాల్‌ అలా క్లారిటీ ఇచ్చారు.. ఇలా సచివాలయంలో..

0
కేంద్ర సర్వీసులోకి డిప్యుటేషన్‌పై వెళ్తున్నారంటూ వస్తున్న వార్తలను సీనియర్ IAS స్మితా సబర్వాల్‌ (Smita Sabharwal) ఖండించారు. ఆ వార్తలు అవాస్తవమని ట్విటర్‌ (ఎక్స్) వేదికగా క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్‌గానే విధులను నిర్వహిస్తానని.. తెలంగాణ ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా చేస్తానన్నారు.
BRS ప్రభుత్వంలో ఉండగా ముఖ్యమంత్రి కార్యాలయంలో స్మితా సబర్వాల్‌ కీలక బాధ్యతలు నిర్వర్తించారు.
కేంద్ర సర్వీసులోకి స్మితా సబర్వాల్‌ వెళ్తున్నారన్న ప్రచారం జరుగుతుండగానే.. సచివాలయంలో తెలంగాణ పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క (ధనసరి అనసూయ ) బాధ్యతలు స్వీకరించిన కార్యక్రమంలో స్మితా సబర్వాల్‌ కనిపించారు.

ఇప్పటికే IAS, IPSల బదిలీలపై కసరత్తు చేస్తోన్న తెలంగాణ ప్రభుత్వం.. స్మితా సబర్వాల్‌‌కు ఏ పోస్ట్ ఇస్తోందో చూడాలి.

Feedback & Advertisements: newsbuzonline@gmail.com
Previous articleమార్పులు చేర్పులు.. ఎవరి దారి వారిదే.. ఆమ్రపాలి.. స్మితా సబర్వాల్
Next articleతెలంగాణలో పలువురు IASల బదిలీ.. ఆమ్రపాలికి కీలక బాధ్యతలు..