SonuSood: పంజాబ్ కాంగ్రెస్‌ తొలి జాబితా విడుదల.. సోనూసూద్ సోదరి పోటీ ఎక్కడినుంచంటే..?

0
SonuSood: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు అధికార కాంగ్రెస్‌ తొలి విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.(Sonusood) 86 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది. పంజాబ్‌ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్‌ చన్నీ ఈసారి కూడా చామ్‌కౌర్‌ సాహెబ్‌ నుంచి బరిలో దిగుతుండగా.. పీసీసీ అధ్యక్షుడు నవ్‌జ్యోత్‌సింగ్‌ సిద్ధూ అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీ చేయనున్నారు.
ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ప్రముఖ సినీ నటుడు సోనూసూద్‌ సోదరి(SonuSood) మాళవిక సూద్‌కు మోగ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించారు. కాంగ్రెస్‌ రాజ్యసభ ఎంపీ ప్రతాప్‌ సింగ్‌ బజ్వాకు గురుదాస్‌పూర్‌లోని క్వాదియాన్‌ టికెట్‌ కేటాయించారు.117 స్థానాలు ఉన్న పంజాబ్‌ అసెంబ్లీకి ఫిబ్రవరి 14న ఎన్నికలు జరగనున్నాయి.

Feedback & Suggestions: newsbuzonline@gmail.com

Also Read :

Previous articleపంజాబ్‌లో ప్రధాని మోదీకి భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం
Next articleశివాజీ – ఛత్రపతి ఎలా అయ్యాడు.. శివాజీ నుండి మనం తెల్సుకోవాల్సింది ఏంటీ..?