పంజాబ్ పర్యటనలో ప్రధాని మోదీకి భద్రతా లోపంపై సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. CJI జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్, పంజాబ్ ప్రభుత్వం తరపున అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. భద్రతా లోపంపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో విచారణ కమిటి ఏర్పాటు చేయాలని త్రిసభ్య ధర్మాసనం నిర్ణయించింది.
సుప్రీంకోర్టు ప్రతిపాదనపై కేంద్ర సొలిసిటర్ జనరల్, పంజాబ్ అడ్వకేట్ జనరల్ తమకు అభ్యంతరం లేదని చెప్పారు. విచారణ కమిటిలో సభ్యులుగా చండీగఢ్ డీజీపీ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఎన్ఐఏకు చెందిన ఐజీ, ఐబీ అధికారులు కూడా ఉంటారని, కమిటీలో పంజాబ్ నుంచి కూడా ప్రతినిధ్యం ఉంటుందని CJI స్పష్టం చేశారు.