Telangana Congress: ఆరు వారాలు.. ఆరు హామీలు.. రేవంత్ రెడ్డి కొత్త నినాదం

0
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో తొలిసారి కాంగ్రెస్‌ (Congress) పార్టీ‌ అధికారంలోకి రాబోతోందా.. ? సోనియా గాంధీ (Sonia Gandhi) ప్రకటించిన ఆరు గ్యారెంటీలే హస్తం పార్టీని అధికారంలోకి తీసుకురాబోతున్నాయా..? తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ( Revanth Reddy) వ్యూహం ఈ ఎన్నికల్లో ఫలిస్తుందా.. ?
5 గ్యారెంటీలు ప్రకటించి కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ విజయం సాధించింది. దీంతో అదే ప్లాన్‌ను తెలంగాణలోనూ అమలు చేయాలని AICC నిర్ణయించింది. అయితే ఇక్కడ హస్తం పార్టీ ఆరు గ్యారెంటీలను ప్రకటించింది. వీటిని ఇంటింటికీ తీసుకెళ్లితే.. ప్రజలు కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారని రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు. అందుకే 119 స్థానాల్లో ఈ ఆరు గ్యారెంటీలే తమ అభ్యర్థులని… వీటిపైనే డిసెంబర్ 9న తొలి సంతకం ఉంటుందన్నారు రేవంత్ రెడ్డి.

మరోవైపు అభ్యర్థుల ఎంపికపైనా తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. 119 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు కసరత్తు చేస్తోంది. ఈ నెల 14న కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంకానుంది. ఆ మీటింగ్‌లోనే కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లను ఫైనల్ చేస్తారు. అదే రోజు సాయంత్రం జాబితా ప్రకటించే అవకాశం ఉంది.
ఈ నెల 15 నుంచి తెలంగాణ కాంగ్రెస్ బస్సు యాత్ర మొదలుకానుంది. కాంగ్రెస్ PAC సమావేశం తర్వాత బస్సు యాత్ర రూట్ మ్యాప్‌పై క్లారిటీ రానుంది. 15, 16 తేదీల్లో ప్రియాంక గాంధీ (Priyanka Gandhi), 18, 19 తేదీల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi), 20, 21 తేదీల్లో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Kharge) బస్సు యాత్రలో పాల్గొనే అవకాశం ఉంది.

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleBRS Once Again: సమయం లేదు మిత్రమా.. KCR సారొస్తున్నారు..
Next articleKCR Success: ఫలించిన కేసీఆర్ వ్యూహం.. ఒక్కటైన గులాబీ నేతలు..