ఈటల మాట నెగ్గింది.. మరి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ వచ్చేనా..?

0
నాలుగు రోజుల కసరత్తు తర్వాత కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ 45 మందితో రెండో జాబితాను విడుదల చేసింది. తొలి జాబితాలో ప్రకటించిన 55 సీట్లతో కలిపి ఇప్పటివరకు 100 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మరో 19 స్థానాలను పెండింగ్‌లో పెట్టింది. అయితే నాలుగు స్థానాలను వామపక్షాలకు కేటాయించే అవకాశం ఉంది. మిగిలిన 15 సీట్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన రెండు జాబితాల్లో 100 సీట్లలో 32 స్థానాలు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే కేటాయించారు. పెండింగ్‌లో పెట్టిన స్థానాల్లో కామారెడ్డి, సిరిసిల్ల కూడా ఉన్నాయి.
కేసీఆర్ పోటీ చేస్తోన్న కామారెడ్డి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. కామారెడ్డి అభ్యర్థిని మూడో జాబితాలో ప్రకటించే అవకాశం ఉంది. ఇక సిరిసిల్లలో మంత్రి కేటీఆర్‌పై ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పోటీ చేసే అవకాశం ఉందని.. దీనిపై అధిష్టానం తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిసింది.
ఇప్పటికే గజ్వేల్‌లో కేసీఆర్‌పై హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నారు. రెండు రోజుల క్రితం తిరిగి కాంగ్రెస్‌లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా గజ్వేల్‌లో కేసీఆర్‌పై పోటీకి సిద్ధమని ప్రకటించారు. కానీ గజ్వేల్‌ అభ్యర్థిగా తూంకుంట నర్సారెడ్డిని తొలి జాబితాలోనే కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో గజ్వేల్‌లో బరిలోకి దిగేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవకాశం రాకపోవచ్చు. మరోవైపు మునుగోడు సీటును కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కేటాయించింది.
గజ్వేల్: కేసీఆర్ (BRS) Vs ఈటల రాజేందర్ (BJP)
కామారెడ్డి: కేసీఆర్ (BRS) Vs రేవంత్ రెడ్డి (కాంగ్రెస్) ?
ఈ ఎన్నికల్లో గజ్వేల్‌తో పాటు కామారెడ్డిలో కేసీఆర్ పోటీ చేస్తుండగా.. ఎలాగైనా కేసీఆర్‌ను గజ్వేల్‌‌లో ఓడించాలని పట్టుదలతో ఉన్న ఈటల రాజేందర్‌ కూడా హుజురాబాద్‌లోనూ పోటీ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే కొడంగల్‌లో బరిలోకి దిగారు. మరోవైపు కామారెడ్డిలో కేసీఆర్‌తో ఢీకొట్టేందుకు సై అన్నారు. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి పోటీకి కాంగ్రెస్ అధిష్టానం ఓకే అంటుందో.. లేదో చూడాలి.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articlePakistan OUT!: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. సెమీస్‌కు ఒక్కటే దారి
Next articleలక్నోలో లెక్క సరి చేయాల్సిందే.. కానీ రోహిత్ సేనకు అదే ప్రాబ్లమ్