తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2 వేల 290 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తోన్న గజ్వేల్‌లో 44 మంది బరిలో ఉన్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తోన్న మరో నియోజకవర్గం కామారెడ్డిలో 39 మంది పోటీ చేస్తున్నారు. గజ్వేల్‌లో 70 మంది స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు.
అత్యధికంగా ఎల్బీనగర్‌లో 48 మంది అభ్యర్థులు, మునుగోడులో 39, పాలేరులో 37, కోదాడలో 34, నాంపల్లిలో 34, ఖమ్మంలో 32, నల్గొండలో 31, కొత్తగూడెంలో 30 మంది పోటీ చేస్తున్నారు.
అత్యల్పంగా నారాయణపేట, బాన్సువాడ నియోజకవర్గాల్లో ఏడుగురు అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 30న పోలింగ్.. డిసెంబర్ 3న కౌంటింగ్ జరుగనుంది.