మొబైల్ నంబర్‌లో ఎన్ని అంకెలుంటాయి..? మన దేశంలో ఎవరిని అడిగిన 10 అని వెంటనే సమాధానం చెప్పేస్తారు. అయితే త్వరలో వారు తమ సమాధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. మొబైల్ నంబర్లకు 11 అంకెలతో కూడిన నంబర్లను ఉపయోగించాలని ట్రాయ్ తాజాగా సిఫార్సు చేసింది. ఆ నంబర్లను 9తో ప్రారంభిస్తే వెయ్యి కోట్ల నంబర్లు అందుబాటులోకి వస్తాయని తెలిపింది.
ల్యాండ్ లైన్, మొబైల్‌లకు కేటాయించేందుకు విరివిగా నంబర్లను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ట్రాయ్ పలు సిఫార్సులు చేసింది. ల్యాండ్ లైన్ నుంచి మొబైల్‌కు కాల్ చేసేటప్పుడు ముందుగా 0 నొక్కడాన్ని తప్పనిసరి చేయాలని కూడా అందులో సూచించింది. డాంగిల్స్‌కు 10 అంకెల్ నంబర్ల స్థానంలో 13 అంకెల నంబర్లను ఉపయోగించాలని చెప్పింది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com