అయోధ్య (Ayodhya) రామయ్యను దర్శించుకోవడానికి భక్తులకు కాజీపేట (Kazipet) రైల్వే స్టేషన్ నుంచి నేరుగా వెళ్లే అవకాశం కలిగింది. రైల్వే శాఖ కాజీపేట మీదుగా ఈనెల 30 నుంచి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆస్తా రైలును కాజీపేట, సికింద్రాబాద్‌ల నుంచి ప్రవేశ పెట్టింది. కాజీపేట నుంచి 07223 నెంబరుతో జనవరి 30, ఫిబ్రవరి 1, 3, 6, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28 మొత్తం 15 ట్రిప్పులు నడుపుతుంది. అయోధ్య నుంచి కాజీపేటకు ఫిబ్రవరి 2, 4, 6, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29, మార్చి 2 తేదీల్లో అందుబాటులో ఉంటుంది.
కాజీపేటలో సాయంత్రం 6.20 గంటలకు బయలుదేరి మరునాడు రాత్రి 9.35 గంటలకు అయోధ్య చేరుతుంది. అయోధ్యలో తిరిగి మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరి కాజీపేటకు మరునాటి రాత్రి 7.02 గంటలకు చేరుతుంది. ఈ రైలు పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్లార్ష, చంద్రాపూర్, సేవాగ్రామం, నాగపూర్, ఇటార్సీ, బోపాల్, బినా, విరాంగన, ఒరాయ్, కాన్‌పూర్, అయోధ్య స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో 20 స్లీపర్ కోచ్‌లు 2 జనరల్ బోగీలు ఉంటాయి.
సికింద్రాబాద్ నుంచి అయోధ్యకు 07221 నెంబరుతో మరో ప్రత్యేక రైలు కూడా అందుబాటులోకి వచ్చింది. సికింద్రాబాద్‌లో ఈనెల 29, 31, ఫిబ్రవరి 2, 5, 7, 9, 11, 13, 15, 17, 19, 21, 23, 25, 27, 29 తేదీలలో అందుబాటులో ఉంటుంది. అయోధ్య నుంచి ఇదే నెంబరుతో ఫిబ్రవరి 1, 3, 5, 8, 10, 12, 14, 16, 18, 20, 22, 24, 26, 28, మార్చి 1, 3 తేదీలలో ఉంటుంది. సికింద్రాబాద్‌లో సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరునాడు రాత్రి 9.30 గంటలకు అయోధ్య చేరుతుంది. ఇది కూడా కాజీపేట నుంచి బయలుదేరే ఆస్తా ఎక్స్‌ప్రెస్ ప్రత్యేక రైలు ఆగిన అన్ని స్టేషన్లలో ఆగుతుంది.