Elections2023: అప్పుడు TRSకు కలిసొచ్చిన ముందస్తు.. మరి ఇప్పుడు BRSకు.. ?

0
తెలంగాణ (Telangana) అసెంబ్లీ (Assembly) ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. వెంటనే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కూడా అమల్లోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారి 2014లో జరిగిన ఎన్నికల్లో TRS (ఇప్పుడు BRS) అధికారంలోకి వచ్చింది. 2019లో ఎన్నికలు జరగాల్సి ఉన్నప్పటికీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. దీంతో 2018లోనే ఎన్నికలు జరిగాయి. రెండోసారి కూడా TRS (ఇప్పుడు BRS) అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు హ్యాట్రిక్‌పై గురి పెట్టిన గులాబీ (BRS) పార్టీ.. ఆగస్ట్ 21న 115 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించి.. ప్రతిపక్షాలకు సవాల్ విసిరింది.
పెండింగ్‌లో పెట్టిన నర్సాపూర్, జనగాం, నాంపల్లి, గోషామహల్‌‌ నియోజకవర్గాలకు రేపో మాపో అభ్యర్థులను ప్రకటించనున్నారు. మల్కాజ్‌గిరి అభ్యర్థిగా మైనంపల్లి హనుమంతరావు పేరును BRS ప్రకటించింది. కానీ తన కుమారుడికి మెదక్ నుంచి BRS టిక్కెట్ రాకపోవడంతో మైనంపల్లి పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం మల్కాజ్‌గిరి, మెదక్ టిక్కెట్లు ఇస్తామని హామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌లో చేరారు. దీంతో BRS పార్టీ మల్కాజ్‌గిరి అభ్యర్థిని కూడా ప్రకటించాల్సి ఉంది.
ఇక పార్టీ పేరును TRS నుంచి BRSగా మార్చిన కేసీఆర్.. మూడోసారి అధికారంలోకి వస్తారా.. BRS మేనిఫెస్టోలో ఏ వరాలు ఉండనున్నాయి? కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు జనం జై కొడుతారా అన్నది డిసెంబర్ 3న తేలనుంది.

JanaSena Party: జనసేన కీలక నిర్ణయం.. 32 స్థానాల్లోనే పోటీ..

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleJanaSena Party: జనసేన కీలక నిర్ణయం.. 32 స్థానాల్లోనే పోటీ..
Next articleBRS Once Again: సమయం లేదు మిత్రమా.. KCR సారొస్తున్నారు..