జాతీయ పార్టీ ఏర్పాటుపై తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) అధినేత, CM KCR ఫుల్ క్లారిటీ ఇచ్చారు. కొత్త పార్టీ పెడితే సాంకేతిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దీంతో TRS పార్టీ పేరు మార్చాలని డిసైడయ్యారు.
TRS పార్టీ పేరును భారత రాష్ట్ర సమితి (BRS) లేదా భారత రాష్ట్రీయ సమితి (BRS)గా మార్చే అవకాశం ఉంది. ఇతర పేర్లను కూడా KCR పరిశీలిస్తున్నారు. దసరా రోజు మధ్యాహ్నం 1:19 నిమిషాలకు పార్టీ పేరును అధికారికంగా ప్రకటిస్తారు. అదే రోజు జాతీయ పార్టీ అజెండాను కూడా వివరిస్తారు. పార్టీ జెండాను కూడా రిలీజ్ చేసే అవకాశముంది.
ఈ నెల 5న (దసరా రోజు) ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో పార్టీ MLAలు, MPలు, పార్టీ కార్యవర్గం సహా 283 మందితో సమావేశం జరుగుతుంది. పార్టీ పేరును మారుస్తూ ఈ సమావేశంలో తీర్మానం చేస్తారు. ఆ తరువాత మధ్యాహ్నం 1:19 నిమిషాలకు జాతీయ పార్టీ పేరును ప్రకటించాలని నిర్ణయించారు.