మూడోసారి గ్రూప్-2 పరీక్షలు వాయిదా.. ఈసారి కారణం ఒక్కటే..

0
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షలు (Group-2 Exams) మరోసారి వాయిదా పడ్డాయి. వచ్చే నెల 6, 7 తేదీల్లో నిర్వహించాల్సిన గ్రూప్-2 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు TSPSC కార్యదర్శి ప్రకటించారు.
గత ఏడాది 783 పోస్ట్‌లతో TSPSC గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసింది. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఆగస్ట్ 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించేందుకు TSPSC షెడ్యూల్ విడుదల చేసింది. కానీ అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్లతో నవంబర్ 2,3 తేదీలకు మార్చారు. నవంబర్ 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభంకావడంతో TSPSC మరోసారి గ్రూప్-2 పరీక్షలను రీషెడ్యూల్ చేసింది. 2024 జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామని ప్రకటించింది.
కానీ ఇప్పటికే TSPSC చైర్మన్‌తో పాటు సభ్యులు రాజీనామా చేశారు. ఇంకా వాటిని గవర్నర్ ఆమోదించాల్సి ఉంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) TSPSCపై మరోసారి సమీక్ష చేశారు. కొత్త బోర్డును నియమించే వరకు పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించారు.

Feedback: newsbuzonline@gmail.com
Previous articleతెలంగాణలో పలువురు IASల బదిలీ.. ఆమ్రపాలికి కీలక బాధ్యతలు..
Next articleమరో వారం రోజుల్లో భారత జట్టు ప్రకటన.. కెప్టెన్‌గా మిడిలార్డర్‌ బ్యాటర్‌..?