మనసు మమత సీరియల్ నటి సూసైడ్.. అతని వేధింపుల వల్లే..

0
తెలుగు టీవీ సీరియల్‌ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య చేసుకున్నారు. మంగళవారం రాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మౌన రాగం, మనసుమమత వంటి పలు సీరియల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు ఆమె సుపరిచితం. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మధురానగర్ హెచ్ 56 బ్లాక్.. సెకండ్‌ ఫ్లోర్‌లో నివాసముంటున్నారు. కొన్ని ఏళ్ల క్రితం కాకినాడ గొల్లప్రోలుకు చెందిన దేవరాజు రెడ్డితో టిక్ టాక్‌లో ఆమెకు పరిచయం ఏర్పడింది. తనకు తల్లిదండ్రులు ఎవ్వరు లేరని చెప్పి శ్రావణితో మరింత దగ్గరయ్యాడు.
అయితే గత కొద్దినెలల నుంచి ఆమెను వేధించటం ప్రారంభించాడని..అతడి వేధింపులు తాళలేక ఆమె ఆత్మహత్యకు చేసుకుందని శ్రావణి తల్లిదండ్రులు ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్నీ పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్క చావుకి కారణం అయిన దేవరాజ్ రెడ్డిని కఠినంగా శిక్షించాలని మృతురాలి సోదరుడు శివ డిమాండ్ చేస్తున్నాడు
తన కూతురు శ్రావణి ఆత్మహత్యకు దేవరాజ్ కారణమణి శ్రావణి తల్లి పాపారత్నం ఆరోపించారు. భాగ్య రేఖ సీరియల్‌లో నటిస్తున్న దేవరాజ్..తన కూతురు శ్రావణి ద్వారానే సీరియల్స్ లోకి ప్రవేశించాడని చెప్పారు. పరిచయమైన దగ్గరి నుంచి వేధింపులకు గురిచేశాడు. పడుకున్నప్పుడు శ్రావణి సెల్ ఫోన్ ఫింగర్ లాక్ తీసుకుని అందరికి ఫోన్లు చేసేవాడు. నా కూతురిని దేవరాజ్ మెంటల్ టార్చర్ పెట్టేవాడు. గతంలో ఎస్ఆర్నగర్ పీఎస్ లో ఫిర్యాదు చేశాం. అయినా దేవరాజ్ మారలేదు.. పోలీసులు దేవరాజ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని పాపారత్నం పేర్కొన్నారు.
Previous articleగ్రామాన్ని దత్తతు తీసుకున్న ప్రభాస్.. తక్షణమే ఎన్ని కోట్లు ఇచ్చారంటే..
Next articleబిగ్ బాస్ కు IPL సవాల్.. ఎలా అంటే..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here