కరోనా టెస్ట్‌లు ఎన్ని రకాలు.. ఏ టెస్ట్ ద్వారా ఫలితం తొందరగా వస్తుంది..?

0
దేశంలో కరోనా టెస్ట్‌ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత కొన్ని రోజులుగా రోజుకు దాదాపు 6 లక్షల కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం ఒక్కరోజే 7 లక్షల 19 వేల 364 శాంపిల్స్ పరీక్షించగా.. నిమిషానికి 500 టెస్ట్‌లు చేస్తున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టం చేసింది.
అయితే కరోనా పరీక్షలు ఎన్ని రకాలుగా చేస్తారో.. ఓసారి తెలుసుకుందాం.
RT-PCR: ఈ పరీక్ష కోసం ముక్కు లేదా గొంతు నుంచి స్వా్బ్ తీసి పరీక్షిస్తారు. దీని ద్వారా 2 నుంచి 3 రోజుల్లో ఫలితం వస్తుంది. వైరస్ నిర్ధారణలో ఇది అత్యుత్తమ పద్ధతి.
ర్యాపిడ్ యాంటిజెన్ టెస్ట్: స్వాబ్ ద్వారానే పరీక్షిస్తారు. ఫలితం 15 నిమిషాల్లో వస్తుంది. పాజిటివం వస్తే ఓకే, కానీ కరోనా లక్షణాలుంటే RT-PCR టెస్ట్ చేయించుకోవాలి.
ట్రూనాట్ టెస్ట్: RT-PCR మాదిరిగానే స్వాబ్ ద్వారా పరీక్షిస్తారు. ఫలితం కూడా ఫాస్ట్‌గానే వస్తుంది.
యాంటీబాడీ టెస్ట్: బ్లెడ్ శాంపిల్స్ సేకరించి పరీక్షిస్తారు. ఫలితం 24 గంటల్లో వస్తుంది.
కరోనా వచ్చిందా..లేదా.. అని తెలుసుకోవడానికి యాంటీజెన్ లేదా RT-PCR టెస్ట్ చేయించుకోవాలి.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleక‌స్ట‌మ‌ర్ల‌కు ఫ్లిప్‌కార్ట్ గుడ్ న్యూస్.. మిగితా కంపెనీలకు చెక్
Next articleకేసీఆర్ ప్రభుత్వమే టార్గెట్‌గా నడ్డా విమర్శలు.. ఏం చేశారో చెప్పాలని డిమాండ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here