ఊరెళ్లిపోతా కృష్ణ మా ఊరెళ్లిపోతా కృష్ణ
ఎర్ర బస్సెక్కి మళ్లీ తిరిగెళ్లిపోతా కృష్ణ
ఏ ఊరెళ్తావ్ అరుణ్ ఏముందని వెళ్తావ్ అరుణ్
ఊరన్న పేరే తప్పా..తీరంతా మారే అరుణ్
నల్లామల అడవుల్లోనా.. పులిసింత సెట్ల కిందా
మల్లేలు పూసేటి సల్లాని పల్లె ఒకటుంది
మనసున్న పల్లె జనం..మోసం తెలియని తనం
అడవి ఆ పల్లె అందం పువ్వు తేనేల సందం
నల్లామల అడవుల్లోన పులిసింత సెట్ల కింద
పుత్తడి గనుల కోసం సిత్తడి బావులు తవ్వే..
పుత్తాడి మెరుపుల్లోన మల్లేలు మాడీపోయే..
మనసున్న పల్లె జనం వలసల్లో సెదిరీపోయే
ఏ ఊరెళ్తావ్ అరుణ్ ఏముందని వెళ్తావ్ అరుణ్
ఊరన్న పేరే తప్పా..తీరంతా మారే అరుణ్
గోదారి లంకల్లోన అరిటాకు నీడల్లోన
ఇసుక తిన్నేలు మీదా వెండి వెన్నెల్లు కురువ
గంగమ్మ గుండెల్లోనా వెచ్చంగా దాచుకున్న
సిరులెన్నో పొంగి పొర్లే పచ్చని పల్లె ఒకటుంది
గోదారి గుండెల్లోనా అరిటాకు నీడల్లోన
ఇసుకంత తరలిపోయే ఎన్నెల్లు రాలిపోయే
ఎగువ గోదారి పైన ఆనకట్టాలు వెలిసే
ఆ పైన పల్లెలన్నీ నిలువునా మునిగిపోయే
ఏ ఊరెళ్తావ్ అరుణ్ ఏముందని వెళ్తావ్ అరుణ్
ఊరన్న పేరే తప్పా..తీరంతా మారే అరుణ్
Song Credits – Chouraastha Music
Feedback & Suggestions: newsbuzonline@gmail.com