10 గ్రాముల బంగారం రూ.62,000 మార్క్‌ను దాటింది. హమాస్ గ్రూప్- ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ప్రభావంతో అంతర్జాతీయంగా విలువైన లోహాలకు డిమాండ్ పెరగడమే ఇందుకు కారణం. ప్రస్తుతం దేశంలో పండగ సీజన్ కొనసాగుతోంది. వచ్చే వారంలో మరింత పెరిగే అవకాశాలుండటం.. దీపావళికి నగల కొనుగోళ్లపై ప్రతికూల ప్రభావం చూపనుంది.
వరుసగా మూడు వారాలుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూ పోతున్నాయి. ఈ నెల 7న ఇజ్రాయెల్- హమాస్ గ్రూప్ మధ్య యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బంగారం ధర 140 డాలర్లకు (8 శాతం) పైగా పెరిగింది. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారం, వెండికి డిమాండ్ మరింత పెరగవచ్చని భావిస్తున్నారు.
యుద్ధం మరింత తీవ్రమైతే, గోల్డ్ రేటు ఆల్‌టైం గరిష్ట స్థాయి 2,085- 2,090 డాలర్ల వరకు చేరే అవకాశాల్లేకపోలేవని చెబుతున్నారు. అదే జరిగితే, దేశీయంగా 10 గ్రాముల బంగారం రూ.65,000 దాటవచ్చని అంచనా వేస్తున్నారు.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com