కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుండడంతో ‘క్వారంటైన్’ అనే పదం అందరి నోట వినిపిస్తోంది. వైరస్‌ను కట్టడి చేయడంలో భాగంగా కరోనా బాధితులు.. అనుమానితులు క్వారంటైన్‌లో ఉండాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఫారెన్ నుంచి వచ్చిన వారిని, వైరస్ సోకిన వారిని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. కరోనా పాజిటివ్ అని తేలితే ట్రీట్‌మెంట్ కూడా అందిస్తున్నారు.
అసలు ‘క్వారంటైన్’ అంటే ఏంటి? ఈ పదం ఎక్కడ పుట్టింది?
క్వారంటైన్ ఇప్పుడు పుట్టింది కాదు.. మధ్యయుగంలోనే అప్పటివారు దీన్ని పాటించారు. 14వ శాతబ్ధంలో ప్రపంచవ్యాప్తంగా ప్లేగు వ్యాధి ప్రబలింది. దీంతో ఇటలీ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ప్లేగు ప్రభావిత ప్రాంతాల నుంచి వచ్చే ఓడల ద్వారా తమ దేశంలోనూ ప్లేగు వ్యాపిస్తుందని భావించిన ఇటలీ.. వెంటనే వారిని కట్టడి చేయాలని భావించింది. ఈ క్రమంలో 40 రోజులపాటు విదేశాల నుంచి వచ్చిన వారిని ఇతరులతో కలవనీయకుండా ప్రత్యేక గది (ఐసోలేషన్)కి తరలించాలని నిర్ణయించింది. దీనినే ఐసోలేషన్ ఇటలీ భాషలో ‘క్వారంట జోర్ని’ అంటే ‘ 40 రోజులు’ అని అర్థం. కానీ ఈ ఆ తర్వాత ఈ పదాలు కాస్త ‘క్వారంటినో’, ‘క్వారంటైన్’గా రూపాంతరం చెందాయి. ఈ విధానం వ్యాధి ఇతరులకు వ్యాప్తి చెందకుండా బాగా పనిచేసేది.
ఈ క్వారంటైన్ విధానం వైరస్‌ను మొత్తంగా తరిమికొట్టలేకపోయినా.. ఒకరి నుంచి మరొకరికి సోకకుండా మాత్రం అడ్డుకోగలుగుతుంది. తాజాగా కరోనా వైరస్ విషయంలోనూ ప్రపంచదేశాలన్నీ ఈ క్వారంటైన్‌నే పాటిస్తున్నాయి. అయితే మారిన పరిస్థితులు, వైద్యశాస్త్రంలో వచ్చిన సాంకేతిక మార్పులు, వైరస్ లక్షణాల దృష్ట్యా క్వారంటైన్ సమయం 14 రోజులకు తగ్గించాయి.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com