Trending: ఛోటా భీమ్, డోరా.. బ్రాండ్ వాల్యూ ఎంతో తెలుసా.. ?

0
చోటా భీమ్:
ఢోలక్‌పూర్ రాజ్యంలో స్నేహితులతో కలిసి జీవిస్తుంటాడు భీమ్. దుష్టశక్తుల నుంచి సాహసోపేతంగా రాజ్యాన్ని కాపాడుతుంటాడు. తొలిసారి, 2008లో POGO టీవీలో ప్రసారమైంది ఈ కామిక్. అప్పటి నుంచి ఛోటా భీమ్‌కు పిల్లలు వీరాభీమానులైపోయారు. ఇప్పటివరకు 29 సినిమాలు విడుదలయ్యాయి, ఛోటాభీమ్ శ్రీలంక, పాకిస్థాన్, అఫ్గానిస్థాన్, ఇరాన్ దేశాల్లో కూడా ప్రసారమవుతోంది.
భీమ్ బ్రాండ్ వాల్యూ ఎంత లేదన్న రూ. 300 కోట్లు ఉంటుందని అంచనా. ఎన్నో వస్తువులకు తను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నాడు. దాదాపు 100 ఉత్పత్తులతో టై అప్ ఉంది. ఆ జాబితాలో గోద్రెజ్, యునీలీవర్, సెలో, టాయ్ జోన్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్.. ఇలా ఎన్నో సంస్థలు ఉన్నాయి.
డోరా:

అమెరికాలో ప్రాణంపోసుకున్న డోరా యానిమేటేడ్ సిరీస్‌కు ఆసియాలో వీరాభిమానులున్నారు. ప్రపంచంలోని సుమారు 40 భాషాల్లో డోరా ప్రసారమవుతోంది. మొదటిసారి 2000లో ఇది ప్రసారమైంది. చాలా ఆడపిల్లల ఉత్పత్తులకు డోరా అంబాసిడర్.
డోరా వాచ్‌లు, లంచ్ బాక్స్‌లు, బ్యాగులు, జడక్లిప్పులు, చెప్పులు, బెల్టులు, ప్లాస్టిక్, జ్యూవెలరీ, డ్రస్సులు.. ఇలా ఎన్నో ఉత్పత్తులకు డోరానే అంబాసిడర్. డోరా మార్కెట్ విలువ 11 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని అంచనా. ప్రతి డోరా ఎపిసోడ్‌నూ టీవీలో ప్రసారం చేయడానికి ముందు, కనీసం 75 ప్రీస్కూళ్లోని పిల్లలకు చూపిస్తారు.

Feedback & Suggestions: newsbuzonline@gmail.com

Previous articleకొత్తిమీర అన్ని కూరల్లో వాడటానికి కారణం ఇదేనా.. ?
Next articleఇంటర్‌నెట్ కట్.. ఏ ఆందోళనకైనా.. అదే వ్యూహం.. చట్టం ఏం చెప్తోంది?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here