వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించాలా.. వద్దా..

0
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించాలా.. వద్దా ఇదే ప్రశ్న ఇప్పుడు చర్చకు దారి తీసింది. ఫిబ్రవరి 8 వరకు టైం ఉన్నప్పటికీ కొందరు పొరపాటున ఇప్పటికే ఓకే అన్నారు. ఇక మరికొందరు మాత్రం వాట్సాప్‌‌‌కు టాటా చెప్పి సిగ్నల్, టెలిగ్రామ్ యాప్‌లను యూజ్ చేస్తున్నారు. మరి ప్రైవసీ పాలసీ అంత డేంజర్‌గా ఉందా.. లేక రిస్క్ తీసుకోవడం అవసరమా అని వాట్సాప్‌ను వీడుతున్నారా..

కొత్త ప్రైవసీ పాలసీని అంగీకరించాలా.. వద్దా..
వాట్సాప్‌ యూజ్ చేయాలనుకుంటే కొత్త ప్రైవసీ పాలసీని తప్పనిసరిగా ఆమోదించాల్సిందే. లేకపోతే ఫిబ్రవరి 8 తర్వాత వాట్సాప్‌ సేవలు నిలిచిపోతాయి.
పొరపాటున ఆమోదించి.. వద్దనుకుంటే..
ఇప్పటికే పొరపాటున అనుమతించి.. మీ సమాచారాన్ని వాట్సాప్ ఇతరులతో షేర్ చేయకూడదని ఇప్పుడు అనుకుంటే.. ఆ అనుమతిని రద్దు చేసి, అకౌంట్‌ను డిలీట్ చేయడానికి వాట్సాప్ 30 రోజుల టైం కూడా ఇచ్చింది. ఆలోపు మీ అనుమతిని ఆప్ట్ అవుట్ చేసి అకౌంట్‌ను డిలీట్ చేస్తేనే మీ సమాచారాన్ని వాట్సాప్ ఎవరితోనూ షేర్ చేయదు.
అసలు ఏ సమాచారాన్ని షేర్ చేస్తుంది..
ఫోన్ నెంబర్, ఫ్రొఫైల్ ఫొటో, స్టేటస్, ఫోన్ కంపెనీ, ఐపీ అడ్రస్, గ్రూప్ డిటేల్స్.. తదితర వివరాలను సేకరించి వాటిని ఫేస్‌బుక్, దాని అనుబంధ సంస్థలు/యాప్‌లు/ఉత్పత్తులు వాడుకోవడానికి ఇస్తుంది.

Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleరేవంత్ రెడ్డి టు జీవన్ రెడ్డి.. మధ్యలో జానారెడ్డి.. కాంగ్రెస్‌లో అంతేనా..?
Next articleKCR కీలక నిర్ణయాలకు బండి సంజయ్ దూకుడే కారణమా..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here