నీళ్లు తాగడం గురించి చాలా అపొహలున్నాయి. ఉదయాన్నే తాగాలి, తినేటప్పుడు తాగొద్దు, ఆరు గ్లాసుల నీళ్లే తాగాలి, ఎక్కువ తాగితే శరీరంలో ఖనిజాలు బయటకు వెళ్లిపోతాయి, తాగకపోతే కిడ్నీలో రాళ్లు తయారవుతాయి.. ఇలా ఎన్నో చెప్తారు. అయితే వీటిలో అన్నీ నిజం కావు. అలాగని అన్నీ అబద్దం కూడా కావు. అందులో కొన్ని నిజాలు, మరికొన్ని అపోహలున్నాయి.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే సరిపడా నీళ్లు తాగాలి. మన శరీరంలో మూడు వంతుల నీళ్లే ఉంటాయి. ఈ మూడు వంతులు ఎప్పటికీ ఉండేలా చూసుకోవాలి. నీళ్ల శాతం తగ్గినప్పుడు మన శరీరమే మనకు సంకేతమిస్తుంది. అప్పుడు దాహం వేస్తుంది. అలా దాహం వేసినప్పుడు తప్పకుండా నీళ్లు తాగాలి. అంతేగానీ ఎప్పుడు పడితే అప్పుడు తాగడం సరికాదు. అయితే రోజు మొత్తంలో 8 నుంచి 10 గ్లాసుల నీళ్లు తాగితే బాడీ హైడ్రేషన్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు.
నీళ్లకు ప్రత్యేకించి కొన్ని సమయాల్లో తాగడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అందుకే వాషింగ్టన్ యూనివర్సిటీ సైంటిస్టులు మనుషుల లైఫ్ స్టైల్ ఆధారంగా నీళ్లు తాగేందుకు ఓ టైం టేబుల్ రెడీ చేశారు.
ఉదయం 8 గంటలకు
ఉదయం 11 గంటలకు
మధ్యాహ్నం ఒంటి గంటకు
సాయంత్రం 4 గంటలకు
రాత్రి 8 గంటలకు
శరీరం మొత్తంలో మూడు వంతుల నీళ్లుంటాయి. మెదడులో 85 శాతం నీళ్లే. సెమీ లిక్విడ్‌గా, సెమీ సాలిడ్‌గా ఉండే మెదడుకు నిరంతరం నీళ్లు అవసరం. అందుకే ఆలోచన విధానం బాగుండాలంటే నీళ్లు ఎక్కువగా తాగాలి. కొందరి రక్తం పల్చగా, మరికొందరిలో చిక్కగా ఉంటుంది. దానికి కారణం నీళ్లు తాగడంలో తేడాలే. రక్తంలో నీళ్ల శాతం ఎక్కువగా ఉంటుంది. దాదాపు 83 శాతం నీళ్లే ఉంటాయి. ఇలా ఉండడానికి నీళ్లు తాగడం తప్పనిసరి.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com