కేంద్ర ప్రభుత్వం మరో నెల రోజుల పాటు (జూన్ 30 వరకు) లాక్‌డౌన్ పొడిగించింది. కాదు.. కాదు.. సడలింపులను మరింతగా పెంచింది కాబట్టి అన్‌లాక్ అనడం కరెక్ట్ అని అంటున్నారు. నేటితో లాక్‌డౌన్ 4.O ముగుస్తుంది. దీంతో లాక్‌డౌన్ 5.O ఉంటుందా.. ఉండదా అనే దానికి కేంద్రం సమాధానం ఇచ్చింది. కంటైన్‌మెంట్ జోన్లలో జూన్ 30 వరకు లాక్‌డౌన్ ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే మిగతా ప్రాంతాల్లో మాత్రం జూన్ 8 నుంచి కొన్నింటికి మినహాయింపులు ఇచ్చింది.
కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల అమలుతో పాటు కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ పొడిగింపు, రాత్రి పూట కర్ఫ్యూ కొనసాగింపుపై తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు తెలిసింది. సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి నిర్ణయాలను వెల్లడించే అవకాశం కనిపిస్తోంది. జూన్ 8 నుంచి హోటళ్లు, రెస్టారెంట్లు, మాల్స్‌కు కేంద్రం అనుమతించింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా వీటికి అనుమతినిచ్చే అవకాశం ఉంది.
దేవాలయాలు, ప్రార్థనామందిరాలకు అనుమతి విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయనున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో బస్సులు ఎప్పటి నుంచి నడపాలనే దానిపై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com