ఆలోచించి.. ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకోండి.. గుండెల్లో పెట్టుకుంటారు

0
KCR
కేసీఆర్ అంటేనే ఎవరి మాట వినడు అని అంటుంటారు. తనను ధిక్కరిస్తే ఎంతటివారినైనా కేసీఆర్ పట్టించుకోరు.. దగ్గరికి కూడా రానివ్వరు. ఆర్టీసీ సమ్మె విషయంలో అది నిజమే అని స్పష్టమైంది. ఆర్టీసీ కార్మికుల విషయంలో కూడా కేసీఆర్ అదే పంథాను అనుసరిస్తున్నారు. మూడు సార్లు డెడ్‌లైన్లు పెట్టినా కార్మికులు వినలేదన్న కోపం.. ఇష్టమున్నట్టు తనను RTC JAC నేతలు తిట్టారని, ప్రతిపక్షాలతో చేతులు కలిపి ప్రభుత్వంపైనే కుట్రలు చేశారనే కారణాలు.. సమ్మెపై కేసీఆర్ వైఖరిని తెలియజేస్తుంది.
ఉద్యమ సమయంలో గొంగలి పురుగునైనా ముద్దు పెట్టుకుంటా అన్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ ఉద్యమంలో తనతో నడిచిన కార్మికులను తమ మాట వినలేదనే కారణంతో.. ఇప్పుడు రోడ్డున పడేయడం సమంజసం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ పెద్ద మనసు చేసుకొని కార్మికులను విధుల్లోకి తీసుకుంటే.. తాము సమ్మెకు వెళ్లి తప్పు చేశామన్న భావన కార్మికుల్లో రాకమానదు. అలాంటి అవకాశం ఉన్నా కూడా కేసీఆర్ పంతానికి పోవడం వల్ల సాధించేదేమిటి.. 49 వేల ఆర్టీసీ కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేసిన సీఎంగా చరిత్రలో నిలిచిపోతారు.
ఆర్టీసీ సమ్మె వల్ల ప్రజలు ఇబ్బందులు పడ్డ మాట వాస్తవమే. కానీ దాన్ని సాకుగా చూపించి ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టకూడదు. ఆర్టీసీ సంస్థ సమ్మెకు ముందు నష్టాల్లోనే ఉంది.. సమ్మె మొదలైయ్యాక కూడా అదే స్థితిలో ఉంది. పోరాడి సాధించుకున్న తెలంగాణలో 49 వేల ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీద పడితే అది రాష్ట్రానికి కూడా మంచిది కాదు.
ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని #NewsBuz తెలంగాణ ప్రభుత్వాన్ని, ఆర్టీసీ యాజమాన్యాన్ని కోరుతోంది.

Feedback & Suggestions : newsbuzonline@gmail.com

Previous articleపద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవ వైభవం
Next articleఅఫ్గానిస్థాన్‌, ఉత్తర కొరియాలో అత్యాచారానికి పాల్పడితే కఠిన శిక్షలు.. మరి పాక్‌లో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here