ఆధార్ ఉంటే క్షణాల్లో ఈ-పాన్..

1
ఆధార్‌ వివరాలతో తక్షణమే ఈ-పాన్‌ను కేటాయించే విధానాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రారంభించారు. పన్ను చెల్లింపుల ప్రక్రియను మరింత సులభతరం చేయాలన్న ఉద్దేశంతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ సేవ పూర్తి ఉచితంగా లభిస్తుందని సీబీడీటీ వెల్లడించింది.
పాన్‌ కేటాయింపు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు నిర్మలా సీతారామన్‌ ఈ ఏడాది బడ్జెట్‌లోనే ఓ ప్రతిపాదన చేశారు. అందులో భాగంగానే ప్రతిసారి అన్ని వివరాలతో దరఖాస్తును నింపాల్సిన అవసరం లేకుండా కేవలం ఆధార్‌ వివరాలతో ఆన్‌లైన్‌లో అప్పటికప్పుడు పాన్‌ నంబర్‌ను కేటాయించే విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఆధార్‌తో అనుసంధానమైన ఫోన్‌ నంబర్‌ను కలిగివున్న దరఖాస్తుదారులకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని, ఈ-పాన్‌ ఉచితంగా లభిస్తుందని సీబీడీటీ వివరించింది.
Feedback & Suggestions: newsbuzonline@gmail.com
Previous articleమెదక్‌లో బోరుబావిలో పడిన బాలుడు మృతి.. ఫలించని ప్రయత్నాలు
Next articleమొబైల్ నంబర్‌లో కీలక మార్పులు.. ట్రాయ్ సిఫార్సులు

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here