వన్డే వరల్డ్ కప్‌లో ఏడో విజయంపై భారత్ కన్నేసింది. ఇప్పటికే ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో గెలిచి.. ప్రత్యర్థులకు చుక్కలు చూపించింది. పాయింట్స్ టేబుల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇవాళ మధ్యాహ్నం శ్రీలంకతో రోహిత్ సేన తలపడనుంది. శ్రీలంక ఇప్పటికే ఆరు మ్యాచ్‌లు ఆడింది. కానీ కేవలం రెండింటిలోనే విజయం సాధించింది. నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. భారత్‌తో జరిగే మ్యాచ్‌లో ఓడితే లంక ప్యాకప్ చెప్పాల్సిందే!.
శ్రీలంకతో మ్యాచ్‌లో భారత్ ఎలాంటి మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయపడ్డ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పూర్తిగా కోలుకోకపోవడంతో మిడిలార్డర్లో సూర్యకుమార్ యాదవ్‌కు మరో ఛాన్స్ దక్కనుంది. బౌలింగ్‌లో షమి చెలరేగిపోతుంటే.. బుమ్రా, కుల్దీప్, జడేజా నిలకడను కొనసాగిస్తున్నారు. సిరాజ్ స్థానంలో ఈ మ్యాచ్‌లో అశ్విన్‌ను ఆడించే అవకాశం లేకపోలేదు.
వాంఖడే పిచ్‌పై మరోసారి భారీ స్కోర్ ఖాయం. ఇప్పటివరకూ వాంఖడేలో రెండు మ్యాచ్‌లు జరగగా, రెండు సార్లు తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 399, 382 పరుగులు చేసింది.
జట్ల అంచనా:
భారత్: రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, అయ్యర్, రాహుల్, సూర్యకుమార్, జడేజా, కుల్దీప్, షమీ, బుమ్రా, సిరాజ్.
శ్రీలంక: కుశాల్ మెండిస్ (కెప్టెన్), నిస్సాంక, కరుణరత్నె, సమరవిక్రమ, చరిత అసలంక, మాథ్యూస్, వెల్లాలగె/డిసిల్వా, రజిత, తీక్షణ, మదుశంక, చమీర.